Posts

Showing posts from June, 2018

పరిమళ

దెయ్యాలు ఉన్నాయని ఎవరితోనూ వాదించడు విశ్వాస్‌. ‘ఉన్నాయి’ అని మాత్రం అంటాడు. అని, అక్కడితో ఆగిపోతాడు. ‘నువ్వు చూశావా? ను..వ్వు... చూ..శా..వా?’ అని ఎవరైనా వాదనకొస్తే నవ్వుతాడు. మనం చూసినవన్నీ, తిరిగి చూపించలేం అని అతడికి తెలుసు. అందుకే నవ్వుతాడు. అదీకాక దెయ్యాల్ని వాదనలోకి లాగడం అతడికి ఇష్టం లేదు. దెయ్యాల్ని అతడు రెస్పెక్ట్‌ చేస్తాడు. మనుషుల కన్నా ఎక్కువగా! కొన్నాళ్ల క్రితం వరకైతే విశ్వాస్‌ వాదించేవాడు. దెయ్యాలు ఉన్నాయని కాదు... దెయ్యాలు లేవని! దెయ్యాలు ఉన్నాయని పర్సనల్‌గా అతడికి రూఢీ అయ్యాక.. ఉన్నాయనే వాదన మొదలుపెట్టాలి కదా. పెట్టలేదు!విశ్వాస్‌కి చిన్నప్పట్నుంచీ ఓ అలవాటు ఉండేది. తను ఇష్టపడేవాళ్ల గురించి మాట్లాడడు. ఎవర్నీ మాట్లాడనివ్వడు. అతడికి తన చెల్లి అంటే ఇష్టం. తన కన్నా రెండేళ్లు చిన్న. కుదురుగా బొమ్మలా ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఎప్పుడూ అన్నతోనే ఉంటుంది. పెళ్లయిపోయాక ఇప్పుడు భర్తతో ఉంటోంది. బావ తన చెల్లిని బాగా చూసుకుంటాడని విశ్వాస్‌కి తెలుసు. కానీ ఎందుకో అతడు బావతో ఎక్కువగా మాట్లాడడు. బావ దగ్గర చెల్లి గురించి అసలే మాట్లాడడు. బావ.. చెల్లి గురించి మాట్లాడుతున్నా వినడానికి...

నమ్మే ధైర్యం మీకుందా?

ఘోస్ట్‌   .....  దెయ్యాల గురించి  మాట్లాడుకునే ధైర్యం భయస్థులకు మాత్రమే ఉంటుంది! సో... భయం అన్నది ధైర్యవంతుల క్వాలిటీ. ఇంతకీ  దెయ్యాలన గుర్తించడం ఎలా?  మీ చుట్టుపక్కల దెయ్యం తిరుగుతోందని కనిపెట్టడం ఎలా? కొన్ని హింట్స్‌. ► మీరున్న చోట హఠాత్తుగా టెంపరేచర్‌ డౌన్‌ అయితే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ►  మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మిమ్మల్ని ఎవరో తాకినట్లు అనిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ► మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో మిమ్మల్ని గమనిస్తూ ఉన్నట్లనిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ► అకారణంగా మీ చర్మంపై వెంట్రుకలు నిక్కబొడుచుకుంటే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ► మీరు పెట్టని చోట పెట్టని వస్తువు కనిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ►   మీ కంటి చివర్ల నుంచి నీడలేవో కదలినట్లు అనిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ► మీ కనుచూపు మేరలో ఎవరూ లేనప్పుడు మిమ్మల్ని ఎవరో పేరు పెట్టి పిలిచినట్లు అనిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ► బల్బులు వాటంతటవి వెలిగితే, ఫ్యాన్లు వాటంతటవి తిరగితే, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు వాటంతటవి పనిచేయడం మొదలుపెడితే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ► మీరు ఒక్కరే ఉన్నప్పుడు ఎవరో మెట్లు...

కన్‌ఫ్యూజన్

విన్న ప్రతిదాన్నీ నమ్మలేం. నమ్మిన ప్రతిదీ నిజమనీ చెప్పలేం. ముఖ్యంగా దెయ్యాల విషయంలో ఈ కన్‌ఫ్యూజన్ ఎప్పుడూ ఉంటుంది. దెయ్యాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ, వాటి గురించిన కథనాలు మాత్రం కోకొల్లలుగా ఉన్నాయి. వాటిలో ఇదొకటి... లా లొరోనా గురించి ఇంకో కథనం కూడా ప్రచారంలో ఉంది. ఇద్దరు పిల్లలకు తల్లయిన తర్వాత మారియా మరో వ్యక్తితో ప్రేమలో పడిందని, అతడి కోసం తన భర్తను, పిల్లలను కూడా చంపేసిందని, అప్పటికీ అతడు తనని స్వీకరించకపోవడంతో అవమానం భరించలేక మరణించిందని కొందరు అంటుంటారు. చనిపోయేముందు తన పిల్లలను చంపినందుకు ఎంతో కుమిలిపోయిందని, అందుకే ఆమె ఆత్మ వాళ్ల కోసం పరితపిస్తోందని చెబుతుంటారు. అయితే ఈ కథనాన్ని నమ్మేవాళ్లు తక్కువమందే ఉన్నారు. మెక్సికో నగరం (యు.ఎస్.ఎ)... టేబుల్ మీద భోజనాలను సర్దుతోంది బ్రెండా. ‘‘ఇవాన్... భోజనానికి రా’’ అంది ప్లేటులో ఆహారాన్ని వడ్డిస్తూ. ‘‘ఆ ఆ వస్తున్నా’’ అంటూ వచ్చి కూర్చున్నాడు ఇవాన్. అటూ ఇటూ చూసి... ‘‘బెన్ ఎక్కడ?’’ అన్నాడు. ‘‘ఏం చెప్పమంటారు మీ సుపుత్రుడి గురించి? ఉన్నచోట ఉండడు కదా! ఆడుకోవడానికని వెళ్లాడు. ఇంతవరకూ రానేలేదు’’ అంది తను కూడా కూర్చుంటూ. ‘‘రాకపోతే అలా వదిలేయడమేనా...

దెయ్యమంటే ఏమిటి?

దెయ్యాలంటే అందరికీ భయమే. కారణం వాటిని ఎవరూ చూడకపోవడమే. చూస్తే ఇక ఏ భయమూ ఉండదు. ఒకప్పుడు పల్లెటూళ్లలోనే దెయ్యాలు ఎక్కువగా ఉండేవి. నగరీకరణకి ఆకర్షితమై అవన్నీ సిటీల్లోకి వచ్చేశాయి. వాటికి బస్సులు, రైళ్లు ఎక్కాల్సిన అవసరం లేదు. గాల్లోనే వచ్చేస్తాయి. అంతా ఎయిర్ వే. నగరాల్లో ఆల్రెడీ ఉన్న దెయ్యాలు, వలస దయ్యాలు ఏకీకృతమై వాట్సప్‌గ్రూప్‌లా జట్టుకట్టాయి. అందులో కొన్ని వీలు చూసుకుని సినిమాల్లో చేరిపోగా, మరికొన్ని సాహిత్యంలో దూరిపోయాయి. వేషభాషలపై అంతగా పట్టులేనివి జర్నలిజంలోకి దూకేశాయి. హాస్య సినిమాలు చూసి భయపడుతూ, పుస్తకం, పేపర్ తెరవడానికి జడుసుకుంటూ మనం జీవించడానికి వీటి కృషే కారణం. దెయ్యమంటే ఏమిటని ఒకసారి ఒక స్వామీజీని అడిగాను. ఆయన మొహానికున్న మాస్క్‌ని తీసి నా వైపు చూశాడు. కెవ్వున కేకేసి పారిపోయి వచ్చేశాను. దెయ్యాలు ఎక్కడైనా ఎలాగైనా ఉండొచ్చు. అనవసరంగా హారర్ సినిమాల్లో వెతుకుతూ ఉంటాం. మనల్ని ఎలాగైనా భయపెట్టాలని రాంగోపాల్‌వర్మ ప్రయత్నించి ప్రయత్నించి విఫలమై తానే భయపడి ఊరుకున్నాడు. తెల్లారి లేచినప్పటి నుంచి బోలెడంతమంది నాయకుల్ని చూసి అలవాటుపడిన ప్రాణాలు మనవి. దెయ్యాలకి మనమా భయపడేది? హారర్ సినిమాల...

ప్రేతాల పార్క్

మిస్టరీ * సరదా కోసం వెళ్లారు. * శవాలుగా మారారు. * దెయ్యాలై సంచరిస్తున్నారు. మే 1973, జపాన్‌లోని హొబారా... ‘టకకనోనుమా గ్రీన్‌ల్యాండ్ పార్క్’ అన్న బోర్డు కనిపించగానే హుషారొచ్చే సింది ‘షోమా’కి. ‘‘మమ్మీ... అటు చూడు, ఎంత బాగుందో’’ అంటూ గంతులు వేయసాగాడు. నవ్వలేక నవ్వింది అసాకా. ఎనిమిదేళ్ల పిల్లాడు షోమా. నెల రోజుల క్రితం ఓపెన్ చేసిన ఆ అమ్యూజ్‌మెంట్ పార్క్ గురించి టీవీలో చూశాడు. అప్పటి నుంచీ ఒకటే గొడవ అక్కడికి తీసుకెళ్లమని. కానీ అసాకాకి ఇష్టం లేదు. ఎందుకంటే వారం రోజుల క్రితం అక్కడో ప్రమాదం జరిగింది. జారుడు బల్ల మీద నుంచి జారుతూ ఓ పిల్లాడు అదుపు తప్పి పక్కకి పడిపోయాడు. తలకి దెబ్బ తగిలి అక్కడి కక్కడే చనిపోయాడు. ఆ సంఘటన గురించి వార్తల్లో చూసి హడలిపోయింది అసాకా. ‘తన కొడుక్కి కూడా అలాంటిదే మైనా అయితే’ అన్న ఆలోచనతో ఆమె తల్లి హృదయం తల్లడిల్లుతోంది. కానీ ఎంత చెప్పినా భర్త వినలేదు. పిల్లాడు సరదా పడుతున్నాడు కదా అంటూ తీసుకొచ్చాడు. ‘ఏంటి అసాకా నువ్వు. ఇంకా మూతి ముడుచుకునే ఉన్నావ్. వాడు చూడు ఎలా గంతులేస్తున్నాడో. వాడి కోసమే కదా వచ్చాం. నువ్విలా ఉంటే ఎలా?’’... డల్‌గా ఉన్న భార్యను చూసి అన్నాడు కైలానో. ‘‘నీ...

కోర్టు ప్రాంగణం లో దెయ్యాలు

new delhi  ‘రాత్రయితే చాలు అకస్మాత్తుగా కంప్యూటర్లు ఆన్ అవ్వడం.. గదుల్లో బుడగలు ఎగురుతూ కనిపించడం.. తెల్లని నీడ కాంపౌండ్‌లో తిరుగుతుండటం.. ఇదంతా హరర్ సినిమాలోని దృశ్యాల్లా అనిపిస్తున్నాయి కదూ.. కాదండీ.. కాడ్కడ్‌దూమా కోర్టు ప్రాంగణంలో రోజూ న్యాయవాదులకు ఎదురవుతున్న ఘటనలు.. కోర్టు ప్రాంగణంలో దెయ్యాలు, భూతాలు తిరుగుతున్నాయని న్యాయవాదులు, సిబ్బంది భయంభయంగా చెబుతున్నారు. ఒక తెల్లని ఆకారం రోజూ ప్రాంగణంలో తిరుగాడుతుండటం తాము స్వయంగా చూశామని కొందరైతే ఢంకా భజాయించి చెబుతున్నారు. వీరి వాదనలను  ఒక సీసీటీవీ కెమెరాలో కనిపించిన దృశ్యాలు మరింత బలపరుస్తున్నాయి. షాద్రా బార్ కౌన్సిల్ సంయుక్త కార్యదర్శి రమణ్ శర్మ కథనం ప్రకారం కాడ్కడ్‌దూమా కోర్టు ప్రాంగణంలో అదృశ్య శక్తులు సంచరిస్తున్నాయి. తూర్పు ఢిల్లీలో నిర్మించిన ఈ పది అంతస్తుల కోర్టు ప్రాంగణంలో న్న లైబ్రరీ, బార్ కార్యాలయంతోపాటు పలు చోట్ల 8 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేశారు. ‘తెల్లారుజామున నాలుగు కంప్యూటర్లు స్విచ్ వేసి ఉండటం కనిపించింది. మేం సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించగా, ముందు రోజు రాత్రి 11.35 నిమిష్లాకు ఒక తెల్లటి నీడ గోడల్లోంచి వచ...

దెయ్యాల మలుపు

ఎనిమిదిన్నరకు బయల్దేరాల్సిన బస్సు తొమ్మిదైనా కదల్లేదు. సీట్‌ నెంబరు ఎయిట్‌ ప్రయాణికుడి కోసం బస్సు ఎదురుచూస్తోంది. బస్సుకోసం మనిషి ఎదురుచూడాలి. బస్సు మనిషి కోసం ఎదురుచూస్తోంది! అంటే మనిషిలో డిసిప్లీన్‌ తప్పింది. దారుణం అనిపించింది రాజేందర్‌కు.  డ్రైవరేం తొందరపడడం లేదు. రావలసినవాళ్లు రాక మానరు, కదలవలసింది కదలక మానదు అనే కర్మ సిద్ధాంతం ఏదో ఆయన జీవితాన్ని నడిపిస్తున్నట్లుంది. లేదా, ‘పికప్‌ నా చేతుల్లో పనే కదా, ఎంత ఆలస్యం అయితే మాత్రం ఏముందీ’ అనుకుంటూనైనా ఉండాలి. బస్సు దిగి తాపీగా ఒళ్లు విరుచుకుంటున్నాడు.  కండక్టరు కూడా పెద్దగా కంగారు పడడం లేదు. ఆయనకూ అలవాటైనట్లుంది.. రోజూ ఎవరో ఒకరు లేట్‌గా పరుగెత్తుకుంటూ రావడం. నిజానికి బస్సులో ఉన్నవాళ్లిద్దరూ డ్రైవర్‌లే. బస్సు గమ్యస్థానానికి చేరేలోపు ఒకరు కొన్ని గంటలు, ఇంకొకరు కొన్ని గంటలు రాత్రంతా డ్రైవ్‌ చేస్తారు. బస్సులో ఉన్నవన్నీ రిజర్వేషన్‌ సీట్లే కాబట్టి టిక్కెట్‌లు కొట్టడం ఉండదు, చార్టు చెక్‌ చేసుకోవడం మాత్రమే ఉంటుంది. అది పెద్ద పనేం కాదు. చార్టు చెక్‌ చేస్తున్నప్పుడు కండక్టరు అయిన మనిషే, బస్సు డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు డ్రైవర్‌ అవుతాడు....

శ్మశాన సౌందర్యం

చలి ఎక్కువైంది. ఎముకలు కొరికే చలి. ‘దెయ్యాలకు ఎముకలు ఉండవు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఈ చలికి చచ్చి, మనుషులయ్యేవి’.. అని చిన్న స్లిప్పులో బాల్‌పెన్‌తో రాసుకుని ఆ స్లిప్పునీ, పెన్నునీ తిరిగి జేబులో పెట్టుకున్నాడు కల్పేశ్‌.ఆ ముక్క రాసుకోడానికి కాస్త ముందు, కల్పేశ్‌ అదే స్లిప్పులో ఇంకో ముక్క కూడా రాసుకున్నాడు. ‘వెన్నెలే లేకపోయుంటే ఇంత శ్మశాన సౌందర్యం మనిషికి దక్కేది కాదేమో!’ అని. శ్మశానంలో అంత రాత్రప్పుడు ఒక్కడే కూర్చొని ఉన్నాడు కల్పేశ్‌. ఎంత రాత్రప్పుడో కల్పేశ్‌ చూసుకోలేదు. ‘అంత రాత్రప్పుడు’ అని మనం అనుకోవడమే కానీ, కల్పేశ్‌కి అది అంత రాత్రి, ఇంత రాత్రి కాదు. రాత్రి మాత్రమే! మనుషుల్ని చూసినవాడు చీకటిని కొలుచుకుని, చీకటిని తలచుకుని భయపడడు. బాగా చలిగా ఉంది. బాగా చలిగా ఉన్నట్లనిపించడం చలి ఎక్కువై కాదు.. ఆ రోజు అక్కడ.. మండుతున్న చితి ఒక్కటి కూడా లేకపోవడం అని కల్పేశ్‌ గ్రహించాడు. కల్పేశ్‌ బాగుంటాడు. శ్మశానంలో రాత్రి పూట, అదీ.. సమాధి అరుగు మీద ఒంటరిగా కూర్చొని, దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న మనిషి గురించి ఇలా చెప్పడం అసందర్భంగా ఉంటుంది. అయినా చెప్పాలి. కల్పేశ్‌ బాగుంటాడు. బా...

అయ్యో పాపం దెయ్యం!!

తనకు ‘వీర’ అని పేరు పెట్టిన వ్యక్తిని బతికించి, చంపేయాలన్నంత కోపం వీర కుమార్‌కి.  ఆ పేరు పెట్టిన దూరపు బంధువు చనిపోయాడు కాబట్టి బతికి పోయాడు!  ‘వీర’ అనే పేరులో బూతేమీ లేదే? మరి తన పేరు మీద తనకు కోపం ఎందుకు?! ఎందుకంటే వీరకుమార్‌  పేరు మోసిన  పిరికివాడు. ‘తెనాలి’ సినిమాలో కమలహాసన్‌ టైప్‌ అన్నమాట. ‘‘నీకు ఏవంటే భయం?’’ అనే డాక్టర్‌ క్వొశ్చన్‌కు కమలహాసన్‌ ఏమంటాడు? సరిగ్గా ఇలా అంటాడు... ‘అంతా శివమయం అంటారు కదండీ. నాకు మాత్రం అంతా భయమయమండీ. నీడంటే భయం. గోడ అంటే భయం. గూడు అంటే భయం. బల్లి అంటే భయం...పిల్లి అంటే భయం. బంతిని చూసినా భయం. ముద్దబంతిని చూసినా భయం. ఏ కాంతను చూసినా భయం. ఏకాంతంగా ఉండాలన్నా భయం’ సినిమాలో కమలహాసన్‌కు ఉన్న భయాలన్నీ వీరకుమార్‌కి ఉన్నాయి. అలాంటి వీర ఒకరోజు రాత్రి హఠాత్తుగా  చనిపోయాడు. చనిపోయినందుకు వీరకు  విపరీతమైన సంతోషంగా ఉంది. బతికినంత కాలం తాను భయపడుతూనే బతికాడు తప్ప, ఎవరినీ భయపెట్టలేదు. ‘‘ఇప్పుడు నాకో గోల్డెన్‌ ఛాన్స్‌ దొరికింది. ఇప్పుడు చూపిస్తా నా తడాఖా.  నేను దెయ్యమై ప్రతి ఒక్కరిని భయపెట్టిస్తాను. వారు గజగజ వణుకుతుంటే నేను భళ్లు భళ్...

వెనకే ఉంది

దేవుణ్ణి నమ్మేవారికి దేవుడు కనిపించినట్లుగా,   దెయ్యాలను నమ్మనివాళ్లకు దెయ్యాలు కనిపించకుండా ఉండవు. ‘‘...అండ్, మీట్‌ మిస్టర్‌ దీపక్‌ మిశ్రా.. దెయ్యాల స్పెషలిస్ట్‌!’’‘హోటల్‌ చోళా ఇంటర్నేషనల్‌’ కాన్ఫరెన్స్‌ హాలు బయట లాంజ్‌లో రాత్రి బాగా పొద్దుపోయాక జరిగింది ఈ పరిచయం. దీపక్‌ మిశ్రాను భగవాన్‌కి పరిచయం చెయ్యడానికి ముందు, భగవాన్‌ని దీపక్‌ మిశ్రాకు పరిచయం చేశాడు దేవన్‌.. ‘‘హి ఈజ్‌ మిస్టర్‌ భగవాన్, హెడ్‌ ఆఫ్‌.. ‘నో గాడ్, నో ఘోస్ట్‌.’’ దేవన్‌ జర్నలిస్ట్‌. చెన్నైలోని ఒక ఆంగ్ల దినపత్రికలో సీనియర్‌ రిపోర్టర్‌. చోళా ఇంటర్నేషనల్‌లో దెయ్యాలపై ఆ మర్నాటి నుండి మూడు రోజులపాటు డీప్‌ డిబేట్‌ జరగబోతోంది. మిశ్రాది ఢిల్లీ. డిబేట్‌ కోసం చెన్నై వచ్చి చోళా ఇంటర్నేషనల్‌లో దిగాడు. భగవాన్‌ది హైదరాబాద్‌. డిబేట్‌లో మిశ్రాను డీ కొనడం కోసం చెన్నై వచ్చి అదే హోటల్‌లో తనకు కేటాయించిన గదికి చేరుకున్నాడు. ‘చోళా’తో దేవన్‌కి మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రముఖులెవరు వచ్చినా, వెంటనే దేవన్‌కు ఫోన్‌ వెళుతుంది.  ‘‘వెల్, మిస్టర్‌ భగవాన్‌.. మీరు నో గాడ్‌.. నో ఘోస్ట్‌ అంటున్నారు. నుదుటిపై పెద్ద బొట్టుతో కనిప...

వీచిక

మంచివే అయినా,  లోక విరుద్ధంగా  కొన్ని పనుల్ని చేయలేం. ‘‘దెయ్యాలు పాత ఇళ్లల్లోనే ఎందుకుండాలి?! కొత్తగా కట్టిన ఇళ్లల్లో ఉండాలని వాటికుండదా?’’ పెద్దగా నవ్వి అన్నాడు వినోద్‌.  వీచిక కూడా నవ్వింది. అయితే అది నవ్వొచ్చి నవ్వడం కాదు. వినోద్‌ నవ్వాడని నవ్వింది. ఆవలింతలకు ఉన్న గుణమే నవ్వుకీ, భయానికీ ఉంటుంది.. అంటుకోవడం! అలాంటి నవ్వు కావొచ్చది.  ఆ రోజు ఉదయమే వాళ్లు ఆ ఇంట్లోకి వచ్చారు. కొత్తగా పెళ్లయినవాళ్లు, కొత్తగా కట్టిన ఇంట్లోకి, కొత్తగా వచ్చి చేరారు. కొత్తగా రావడం అంటే.. కాళ్ల పారాణి ఆరకముందే ఇటు వచ్చేయడం కాదు. అప్పటివరకు ఉన్న ఇంటిని ఖాళీ చేసి, ఈ ఇంట్లోకి వచ్చి చేరారు. పెద్దగా సామాను లేదు. ఇల్లు మాత్రం పెద్దది. ఓనర్‌ కూడా పెద్దాయన. ఆయన ఒక్కరే ఉంటారు. పక్క పోర్షన్‌లోనే ఉంటారు.  వీళ్లున్న పోర్షన్‌ కొత్తగా కట్టింది. పెద్దాయన ఉన్నది పాతది. ఆ పాత ఇంటి కంటే కూడా పాత మనిషి ఆయన. ఓ డెబ్భై ఏళ్లు ఉంటాయి. తెల్లగా ఉంటారు. తెల్లటి పైజమా లాల్చీ వేసుకుని ఉంటారు. కొత్త ఇంట్లోకి ఆయనే షిఫ్ట్‌ అయి, పాత ఇంటినే ఈ దంపతులకు ఇవ్వొచ్చు కానీ ఇవ్వలేదు. ‘ఎందుకలా?’ అని వీళ్లు అడగలేదు. ఆయనకెవరూ ...

భయపడిన దెయ్యం

నేను దెయ్యాన్ని. ఇలా అనగానే మీలో చాలామంది ఉలిక్కి పడతారని తెలుసు. ఆమాటకొస్తే, నేనూ అంతే. బ్రతికున్నప్పుడు ఎవరైనా `దెయ్యం’ అంటేచాలు, ఉలిక్కిపడి చచ్చినంతపని చేసేవాడ్ని. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. ఎందుకంటే నేనే దెయ్యాన్ని. అంతా నా గురించే- అదే,దెయ్యం గురించే భయపడుతుంటే నేనెవరి గురించి భయపడాలి ? అందుకే నాకిప్పుడు భయంలేదు. అర్థరాత్రి వేళకూడా , స్వేచ్ఛగా శ్మశానంలో తిరుగుతుంటాను. హ్హీహ్హీహ్హీ. దెయ్యాలకున్న స్వేచ్ఛ ఈ భూప్రపంచంలో మరెవ్వరికీ లేదంటే నమ్మండి. మాకు రెక్కలు లేవు, కానీ ఎగురుతాం. ఆకారం లేదు, కానీ బహురూపాల్లో అందర్నీ భయపెడుతుంటాం. మాకు రంగు,రుచి వాసన లేవు, కానీ పరకాయ ప్రవేశంతో ఆస్వాదిస్తుంటాం. `పరకాయ’ అంటే అర్థంకాలేదా…? అదేనండి పరుల కాయాల్లోకి ప్రవేశించి అన్నీ అనుభవిస్తుంటామన్నమాట. ఈ స్పెషల్ స్టేటస్ మాకిచ్చినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. కానీ కాలం ఎప్పుడూ ఒక రకంగా ఉండదు. భయమన్నదే తెలియని నాకు ఈ మధ్య భయంపట్టుకుంది. ఒళ్లు (అది లేకపోయినప్పటికీ ఉన్నట్లుగా) వణకిపోతోంది. పరంధామయ్యను కలవక ముందువరకు నేను బాగానే ఉన్నాను. కలిసిన తర్వాతే భయం మొదలైంది. అసలేం జరిగిందంటే… ఆరోజ...

‘ప్రేతాత్మ

‘ప్రేతాత్మ’ పత్రికా కార్యాలయం! ఎడిటర్‌ ఎదురుగా కూర్చొని ఉన్నాడు క్షుద్రేంద్ర. ప్రముఖ క్షుద్ర రచయిత అతడు. అతడెలా ఉంటాడో ఒక్కసారైనా చూడాలని పాఠకులే కాదు, పత్రికా సిబ్బంది కూడా కుతూహల పడుతుంటారు. అయితే ఆ అదృష్టం ఒక్క ‘ప్రేతాత్మ’ ఎడిటర్‌కి మాత్రమే దక్కింది!పదిహేనేళ్లుగా ఆ పత్రిక వస్తోంది. ప్రారంభం నుంచీ అందులో వారం వారం క్షుద్రేంద్ర కథ వస్తోంది. అది దెయ్యం కథ. బాగా పాపులర్‌. అసలు ప్రారంభ సంచిక మార్కెట్‌లోకి వచ్చినప్పుడే.. ‘రచయితను ఒకసారి చూడాలని ఉంది’ అని పత్రికా కార్యాలయానికి పుర్రెలకొద్దీ ఉత్తరాలు, ఎముకలకొద్దీ ఈమెయిళ్లు వచ్చాయి. ఆ తొక్కిడిని తట్టుకోలేక నాలుగో వారంలోనే చిన్న నోట్‌ పెట్టాడు ఎడిటర్‌..‘చితి కాలుతున్నప్పుడు కపాలమోక్షం జరిగినట్లుగా, కథ చదువుతున్నప్పుడే రచయిత మీకు పైకి లేస్తూ కనిపిస్తాడు చూడండి’ అని! ‘ప్రేతాత్మ’ ఎడిటర్‌ పాఠకులకు పెట్టే గమనికలన్నీ ఇలాగే గమ్మతుగా ఉంటాయి. ఎడిటర్‌ తనదైన శైలిలో ఎన్ని గమనికలు పెట్టినా, పాఠకలోకం మాత్రం క్షుద్రేంద్రను చూపించమని ఏళ్లుగా అడుగుతూనే ఉంది.‘‘అలా చూపించలేం కానీ, కావాలంటే రచయితతో ‘ప్రశ్నలు–జవాబులు’ శీర్షికను పెట్టించగలను అని పాఠకులకు మరో గ...

నా చావు నే చస్తా

తాతామనవళ్లిద్దరూ ఒక నిద్ర తీశాక.. మధ్యరాత్రిలో ఏదో చప్పుడైంది. మనవడు మేల్కొన్నాడు. ‘‘భయమేస్తోంది తాతా’’ అన్నాడు.. ముఖాన్ని తాత డొక్కలోకి దూర్చేస్తూ.  శుభం! సినిమా ముగిసింది. ‘నా సావు నే సస్తా. నీకెందుకు?’.. సినిమాలోని డైలాగ్‌. ఎవరో పకపకమంటున్నారు. డిమ్‌ లైట్‌లలో కొద్దికొద్దిగా కదులుతూ ‘ఎగ్జిట్‌’ వైపుకు మెట్లు దిగుతున్నారు తాత, మనవడు. పదేళ్లుంటాయి మనవడికి. తాత చెయ్యి పట్టుకుని ఒక్కో అడుగూ వేస్తున్నాడు. చూసిన సినిమాపై లేదు వాడి ధ్యాస. చూడబోయే ‘స్కేరీ హౌస్‌’ మీద ఉంది. మల్టీప్లెక్స్‌ అది. నాలుగైదు స్క్రీన్‌లు, చిన్న షాపింగ్‌ మాల్, కిడ్స్‌ ప్లే జోన్, స్కేరీ హౌస్‌.. ఇలాంటివన్నీ ఉన్నాయి. థియేటర్‌ లోపలికి వెళ్లే ముందే మాట తీసుకున్నాడు మనవడు. ‘‘తాతా.. సినిమా అయిపోయాక స్కేరీ హౌస్‌కి వెళ్లాలి’’ అని. తాతగారు నవ్వారు. ‘‘సరే’’ అన్నారు.మొదట పిల్లల సినిమాలు ఏవైనా ఉంటాయేమోనని ఆయన చూశారు. ఉన్నాయి కానీ, ఆ టైమ్‌లో షోలు లేవు. ‘‘ఈ సినిమాకు టిక్కెట్లు ఉన్నాయట. వెళ్దామా?’’ అన్నాడు. ‘‘వద్దు తాతా. స్కేరీ హౌస్‌కు వెళ్దాం’’ అన్నాడు మనవడు. స్కేరీ హౌస్‌లో ఏమ...

హార్రర్ బిగిన్స్..

నేను ఒక్కణ్నీ ఉన్నప్పుడు దెయ్యం నాకు కనిపించాలి. అందరి మధ్యా ఉన్నప్పుడు దెయ్యం కనిపిస్తే ఆ దెయ్యాన్ని నేను మనిషి అనుకుంటాను తప్ప దెయ్యం అనుకోను. దేవుడు ప్రత్యక్షమై ‘ఏం కావాలో కోరుకో’ అంటే.. ఒక్కసారి దెయ్యాన్ని చూపించమంటాను నేను. అంత క్రేజు నాకు దెయ్యమంటే! దేవుడంటే మళ్లీ అంత లేదు. గుడికి వెళ్లడం, టెంకాయ కొట్టడం, ఓ దండం పెట్టుకోవడం, లెంపలేసుకోవడం.. అంతవరకే! లెంపలు వేసుకోవడం ఎందుకంటే.. మనసులో దెయ్యాన్ని పెట్టుకుని, దేవుడి దగ్గరికి వెళ్తున్నానని. దేవుడి గుడికి నేను వెళ్లడానికి కారణం.. దెయ్యం గుడులెక్కడా లేకపోవడమే. ఉంటే దేవుణ్ణి వదిలేసి, దెయ్యం గుడికే వెళ్లేవాడిని. అప్పుడు దెయ్యం ప్రత్యక్షమై ‘ఏం కావాలో కోరుకో’ అంటే.. ‘దేవుణ్ని ఒకసారి చూపించు’ అని మాత్రం అడగను. ‘నువ్వే మళ్లీ ఒకసారి కనిపించు’ అని ఆ దెయ్యాన్ని అడుగుతాను. దెయ్యం అంటే నాకెందుకంత పిచ్చో తెలీదు. కానీ దెయ్యంపిచ్చి పట్టేసింది. ఎప్పుడు పట్టిందో, ఎలా పట్టిందో.. అవేం గుర్తు లేవు. ఆ పిచ్చిని వదిలించుకోవడమూ నాకు ఇష్టం లేదు. వదిలిందా నాకు పిచ్చిపట్టి పోతుంది. దెయ్యం చంపుతుందని అంటారు. దెయ్యం నన్ను పనిగట్టుకుని చంపనవసరం లేదు. నా దెయ్యంపి...