Posts

శ్మశాన సౌందర్యం

చలి ఎక్కువైంది. ఎముకలు కొరికే చలి. ‘దెయ్యాలకు ఎముకలు ఉండవు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఈ చలికి చచ్చి, మనుషులయ్యేవి’.. అని చిన్న స్లిప్పులో బాల్‌పెన్‌తో రాసుకుని ఆ స్లిప్పునీ, పెన్నునీ తిరిగి జేబులో పెట్టుకున్నాడు కల్పేశ్‌.ఆ ముక్క రాసుకోడానికి కాస్త ముందు, కల్పేశ్‌ అదే స్లిప్పులో ఇంకో ముక్క కూడా రాసుకున్నాడు. ‘వెన్నెలే లేకపోయుంటే ఇంత శ్మశాన సౌందర్యం మనిషికి దక్కేది కాదేమో!’ అని. శ్మశానంలో అంత రాత్రప్పుడు ఒక్కడే కూర్చొని ఉన్నాడు కల్పేశ్‌. ఎంత రాత్రప్పుడో కల్పేశ్‌ చూసుకోలేదు. ‘అంత రాత్రప్పుడు’ అని మనం అనుకోవడమే కానీ, కల్పేశ్‌కి అది అంత రాత్రి, ఇంత రాత్రి కాదు. రాత్రి మాత్రమే! మనుషుల్ని చూసినవాడు చీకటిని కొలుచుకుని, చీకటిని తలచుకుని భయపడడు. బాగా చలిగా ఉంది. బాగా చలిగా ఉన్నట్లనిపించడం చలి ఎక్కువై కాదు.. ఆ రోజు అక్కడ.. మండుతున్న చితి ఒక్కటి కూడా లేకపోవడం అని కల్పేశ్‌ గ్రహించాడు. కల్పేశ్‌ బాగుంటాడు. శ్మశానంలో రాత్రి పూట, అదీ.. సమాధి అరుగు మీద ఒంటరిగా కూర్చొని, దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న మనిషి గురించి ఇలా చెప్పడం అసందర్భంగా ఉంటుంది. అయినా చెప్పాలి. కల్పేశ్‌ బాగుంటాడు. బా...

అయ్యో పాపం దెయ్యం!!

తనకు ‘వీర’ అని పేరు పెట్టిన వ్యక్తిని బతికించి, చంపేయాలన్నంత కోపం వీర కుమార్‌కి.  ఆ పేరు పెట్టిన దూరపు బంధువు చనిపోయాడు కాబట్టి బతికి పోయాడు!  ‘వీర’ అనే పేరులో బూతేమీ లేదే? మరి తన పేరు మీద తనకు కోపం ఎందుకు?! ఎందుకంటే వీరకుమార్‌  పేరు మోసిన  పిరికివాడు. ‘తెనాలి’ సినిమాలో కమలహాసన్‌ టైప్‌ అన్నమాట. ‘‘నీకు ఏవంటే భయం?’’ అనే డాక్టర్‌ క్వొశ్చన్‌కు కమలహాసన్‌ ఏమంటాడు? సరిగ్గా ఇలా అంటాడు... ‘అంతా శివమయం అంటారు కదండీ. నాకు మాత్రం అంతా భయమయమండీ. నీడంటే భయం. గోడ అంటే భయం. గూడు అంటే భయం. బల్లి అంటే భయం...పిల్లి అంటే భయం. బంతిని చూసినా భయం. ముద్దబంతిని చూసినా భయం. ఏ కాంతను చూసినా భయం. ఏకాంతంగా ఉండాలన్నా భయం’ సినిమాలో కమలహాసన్‌కు ఉన్న భయాలన్నీ వీరకుమార్‌కి ఉన్నాయి. అలాంటి వీర ఒకరోజు రాత్రి హఠాత్తుగా  చనిపోయాడు. చనిపోయినందుకు వీరకు  విపరీతమైన సంతోషంగా ఉంది. బతికినంత కాలం తాను భయపడుతూనే బతికాడు తప్ప, ఎవరినీ భయపెట్టలేదు. ‘‘ఇప్పుడు నాకో గోల్డెన్‌ ఛాన్స్‌ దొరికింది. ఇప్పుడు చూపిస్తా నా తడాఖా.  నేను దెయ్యమై ప్రతి ఒక్కరిని భయపెట్టిస్తాను. వారు గజగజ వణుకుతుంటే నేను భళ్లు భళ్...

వెనకే ఉంది

దేవుణ్ణి నమ్మేవారికి దేవుడు కనిపించినట్లుగా,   దెయ్యాలను నమ్మనివాళ్లకు దెయ్యాలు కనిపించకుండా ఉండవు. ‘‘...అండ్, మీట్‌ మిస్టర్‌ దీపక్‌ మిశ్రా.. దెయ్యాల స్పెషలిస్ట్‌!’’‘హోటల్‌ చోళా ఇంటర్నేషనల్‌’ కాన్ఫరెన్స్‌ హాలు బయట లాంజ్‌లో రాత్రి బాగా పొద్దుపోయాక జరిగింది ఈ పరిచయం. దీపక్‌ మిశ్రాను భగవాన్‌కి పరిచయం చెయ్యడానికి ముందు, భగవాన్‌ని దీపక్‌ మిశ్రాకు పరిచయం చేశాడు దేవన్‌.. ‘‘హి ఈజ్‌ మిస్టర్‌ భగవాన్, హెడ్‌ ఆఫ్‌.. ‘నో గాడ్, నో ఘోస్ట్‌.’’ దేవన్‌ జర్నలిస్ట్‌. చెన్నైలోని ఒక ఆంగ్ల దినపత్రికలో సీనియర్‌ రిపోర్టర్‌. చోళా ఇంటర్నేషనల్‌లో దెయ్యాలపై ఆ మర్నాటి నుండి మూడు రోజులపాటు డీప్‌ డిబేట్‌ జరగబోతోంది. మిశ్రాది ఢిల్లీ. డిబేట్‌ కోసం చెన్నై వచ్చి చోళా ఇంటర్నేషనల్‌లో దిగాడు. భగవాన్‌ది హైదరాబాద్‌. డిబేట్‌లో మిశ్రాను డీ కొనడం కోసం చెన్నై వచ్చి అదే హోటల్‌లో తనకు కేటాయించిన గదికి చేరుకున్నాడు. ‘చోళా’తో దేవన్‌కి మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రముఖులెవరు వచ్చినా, వెంటనే దేవన్‌కు ఫోన్‌ వెళుతుంది.  ‘‘వెల్, మిస్టర్‌ భగవాన్‌.. మీరు నో గాడ్‌.. నో ఘోస్ట్‌ అంటున్నారు. నుదుటిపై పెద్ద బొట్టుతో కనిప...

వీచిక

మంచివే అయినా,  లోక విరుద్ధంగా  కొన్ని పనుల్ని చేయలేం. ‘‘దెయ్యాలు పాత ఇళ్లల్లోనే ఎందుకుండాలి?! కొత్తగా కట్టిన ఇళ్లల్లో ఉండాలని వాటికుండదా?’’ పెద్దగా నవ్వి అన్నాడు వినోద్‌.  వీచిక కూడా నవ్వింది. అయితే అది నవ్వొచ్చి నవ్వడం కాదు. వినోద్‌ నవ్వాడని నవ్వింది. ఆవలింతలకు ఉన్న గుణమే నవ్వుకీ, భయానికీ ఉంటుంది.. అంటుకోవడం! అలాంటి నవ్వు కావొచ్చది.  ఆ రోజు ఉదయమే వాళ్లు ఆ ఇంట్లోకి వచ్చారు. కొత్తగా పెళ్లయినవాళ్లు, కొత్తగా కట్టిన ఇంట్లోకి, కొత్తగా వచ్చి చేరారు. కొత్తగా రావడం అంటే.. కాళ్ల పారాణి ఆరకముందే ఇటు వచ్చేయడం కాదు. అప్పటివరకు ఉన్న ఇంటిని ఖాళీ చేసి, ఈ ఇంట్లోకి వచ్చి చేరారు. పెద్దగా సామాను లేదు. ఇల్లు మాత్రం పెద్దది. ఓనర్‌ కూడా పెద్దాయన. ఆయన ఒక్కరే ఉంటారు. పక్క పోర్షన్‌లోనే ఉంటారు.  వీళ్లున్న పోర్షన్‌ కొత్తగా కట్టింది. పెద్దాయన ఉన్నది పాతది. ఆ పాత ఇంటి కంటే కూడా పాత మనిషి ఆయన. ఓ డెబ్భై ఏళ్లు ఉంటాయి. తెల్లగా ఉంటారు. తెల్లటి పైజమా లాల్చీ వేసుకుని ఉంటారు. కొత్త ఇంట్లోకి ఆయనే షిఫ్ట్‌ అయి, పాత ఇంటినే ఈ దంపతులకు ఇవ్వొచ్చు కానీ ఇవ్వలేదు. ‘ఎందుకలా?’ అని వీళ్లు అడగలేదు. ఆయనకెవరూ ...

భయపడిన దెయ్యం

నేను దెయ్యాన్ని. ఇలా అనగానే మీలో చాలామంది ఉలిక్కి పడతారని తెలుసు. ఆమాటకొస్తే, నేనూ అంతే. బ్రతికున్నప్పుడు ఎవరైనా `దెయ్యం’ అంటేచాలు, ఉలిక్కిపడి చచ్చినంతపని చేసేవాడ్ని. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. ఎందుకంటే నేనే దెయ్యాన్ని. అంతా నా గురించే- అదే,దెయ్యం గురించే భయపడుతుంటే నేనెవరి గురించి భయపడాలి ? అందుకే నాకిప్పుడు భయంలేదు. అర్థరాత్రి వేళకూడా , స్వేచ్ఛగా శ్మశానంలో తిరుగుతుంటాను. హ్హీహ్హీహ్హీ. దెయ్యాలకున్న స్వేచ్ఛ ఈ భూప్రపంచంలో మరెవ్వరికీ లేదంటే నమ్మండి. మాకు రెక్కలు లేవు, కానీ ఎగురుతాం. ఆకారం లేదు, కానీ బహురూపాల్లో అందర్నీ భయపెడుతుంటాం. మాకు రంగు,రుచి వాసన లేవు, కానీ పరకాయ ప్రవేశంతో ఆస్వాదిస్తుంటాం. `పరకాయ’ అంటే అర్థంకాలేదా…? అదేనండి పరుల కాయాల్లోకి ప్రవేశించి అన్నీ అనుభవిస్తుంటామన్నమాట. ఈ స్పెషల్ స్టేటస్ మాకిచ్చినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. కానీ కాలం ఎప్పుడూ ఒక రకంగా ఉండదు. భయమన్నదే తెలియని నాకు ఈ మధ్య భయంపట్టుకుంది. ఒళ్లు (అది లేకపోయినప్పటికీ ఉన్నట్లుగా) వణకిపోతోంది. పరంధామయ్యను కలవక ముందువరకు నేను బాగానే ఉన్నాను. కలిసిన తర్వాతే భయం మొదలైంది. అసలేం జరిగిందంటే… ఆరోజ...

‘ప్రేతాత్మ

‘ప్రేతాత్మ’ పత్రికా కార్యాలయం! ఎడిటర్‌ ఎదురుగా కూర్చొని ఉన్నాడు క్షుద్రేంద్ర. ప్రముఖ క్షుద్ర రచయిత అతడు. అతడెలా ఉంటాడో ఒక్కసారైనా చూడాలని పాఠకులే కాదు, పత్రికా సిబ్బంది కూడా కుతూహల పడుతుంటారు. అయితే ఆ అదృష్టం ఒక్క ‘ప్రేతాత్మ’ ఎడిటర్‌కి మాత్రమే దక్కింది!పదిహేనేళ్లుగా ఆ పత్రిక వస్తోంది. ప్రారంభం నుంచీ అందులో వారం వారం క్షుద్రేంద్ర కథ వస్తోంది. అది దెయ్యం కథ. బాగా పాపులర్‌. అసలు ప్రారంభ సంచిక మార్కెట్‌లోకి వచ్చినప్పుడే.. ‘రచయితను ఒకసారి చూడాలని ఉంది’ అని పత్రికా కార్యాలయానికి పుర్రెలకొద్దీ ఉత్తరాలు, ఎముకలకొద్దీ ఈమెయిళ్లు వచ్చాయి. ఆ తొక్కిడిని తట్టుకోలేక నాలుగో వారంలోనే చిన్న నోట్‌ పెట్టాడు ఎడిటర్‌..‘చితి కాలుతున్నప్పుడు కపాలమోక్షం జరిగినట్లుగా, కథ చదువుతున్నప్పుడే రచయిత మీకు పైకి లేస్తూ కనిపిస్తాడు చూడండి’ అని! ‘ప్రేతాత్మ’ ఎడిటర్‌ పాఠకులకు పెట్టే గమనికలన్నీ ఇలాగే గమ్మతుగా ఉంటాయి. ఎడిటర్‌ తనదైన శైలిలో ఎన్ని గమనికలు పెట్టినా, పాఠకలోకం మాత్రం క్షుద్రేంద్రను చూపించమని ఏళ్లుగా అడుగుతూనే ఉంది.‘‘అలా చూపించలేం కానీ, కావాలంటే రచయితతో ‘ప్రశ్నలు–జవాబులు’ శీర్షికను పెట్టించగలను అని పాఠకులకు మరో గ...

నా చావు నే చస్తా

తాతామనవళ్లిద్దరూ ఒక నిద్ర తీశాక.. మధ్యరాత్రిలో ఏదో చప్పుడైంది. మనవడు మేల్కొన్నాడు. ‘‘భయమేస్తోంది తాతా’’ అన్నాడు.. ముఖాన్ని తాత డొక్కలోకి దూర్చేస్తూ.  శుభం! సినిమా ముగిసింది. ‘నా సావు నే సస్తా. నీకెందుకు?’.. సినిమాలోని డైలాగ్‌. ఎవరో పకపకమంటున్నారు. డిమ్‌ లైట్‌లలో కొద్దికొద్దిగా కదులుతూ ‘ఎగ్జిట్‌’ వైపుకు మెట్లు దిగుతున్నారు తాత, మనవడు. పదేళ్లుంటాయి మనవడికి. తాత చెయ్యి పట్టుకుని ఒక్కో అడుగూ వేస్తున్నాడు. చూసిన సినిమాపై లేదు వాడి ధ్యాస. చూడబోయే ‘స్కేరీ హౌస్‌’ మీద ఉంది. మల్టీప్లెక్స్‌ అది. నాలుగైదు స్క్రీన్‌లు, చిన్న షాపింగ్‌ మాల్, కిడ్స్‌ ప్లే జోన్, స్కేరీ హౌస్‌.. ఇలాంటివన్నీ ఉన్నాయి. థియేటర్‌ లోపలికి వెళ్లే ముందే మాట తీసుకున్నాడు మనవడు. ‘‘తాతా.. సినిమా అయిపోయాక స్కేరీ హౌస్‌కి వెళ్లాలి’’ అని. తాతగారు నవ్వారు. ‘‘సరే’’ అన్నారు.మొదట పిల్లల సినిమాలు ఏవైనా ఉంటాయేమోనని ఆయన చూశారు. ఉన్నాయి కానీ, ఆ టైమ్‌లో షోలు లేవు. ‘‘ఈ సినిమాకు టిక్కెట్లు ఉన్నాయట. వెళ్దామా?’’ అన్నాడు. ‘‘వద్దు తాతా. స్కేరీ హౌస్‌కు వెళ్దాం’’ అన్నాడు మనవడు. స్కేరీ హౌస్‌లో ఏమ...