దెయ్యం
దెయ్యం
సందర్భం:
రాత్రి తొమ్మిదింటికి ఈ రోజు త్వరగా నిద్రపోదాం అని ముసుగుతన్ని పడుకున్నాడు రవి. పదింటికి ఎవరో తలుపు కొట్టారు, వెళ్లి తీశాడు, అతని ఫ్రెండ్ శ్రీను వచ్చాడు. ఇద్దరు ముసుగుతన్ని పడుకొని కబుర్లు చెప్పుకుంటున్నారు.
రవి: బావా నువ్వెవరినైనా ప్రేమించావా ?
శ్రీను : లేదు రా!
రవి: పోనీ నిన్నెవరైనా ప్రేమించారా ?
శ్రీను: లేదు రా!
రవి: ఎవరినైనా ప్రేమించాలనుకున్నావా ?
శ్రీను: లేదు రా!
రవి: నిన్నెవరైనా ప్రేమించాలనుకున్నారా ?
శ్రీను: లేదు రా!
…కొద్దిసేపు గదిలో అంతా నిశబ్ధం…
శ్రీను: బావా! నీకు దయ్యాలంటే భయమా ?
రవి: లేదు రా!
శ్రీను: దయ్యలని ఎప్పుడైనా చూసావా ?
రవి: లేదు రా!
నేను: అసలు దయ్యాలున్నాయంటావా ?
శ్రీను: లేదు రా!
…ఈ లోపు ఎవరో మా డోర్ లాక్ ఓపెన్ చేస్తునట్టు శబ్దం వచ్చింది. డోర్ ఓపెన్ అయ్యింది. ఎవరో లోపలకి వస్తున్నారు…
రవి: బావా! కీ ఎవడికి ఇచ్చావ్ రా. ఈ టైం లో వచ్చాడు ఎవడో.
శ్రీను:రేయ్! ఎవరితో మాట్లాడుతున్నావ్ బే! కలవరిస్తున్నావా ఏంది ? వర్క్ అయిపోచేసి ఇప్పుడే ఆఫీసు నుండి వస్తున్నా నేను.
…రవి ఉలిక్కిపడి లేచి, లైట్ వేసి, డోర్ దగ్గర ఉన్న నన్ను చూస్తూ…
రవి: బావా! జోకులెయ్యకు రా. ఇంతసేపు పక్కనే పడుకున్నావ్, బయటకి ఎప్పుడు వెళ్ళావ్.
నేను: ఈ టైం లో దొబ్బమాకు నన్ను. నువ్వు నీ రొట్ట కామెడీలు. గుడ్లు మూసుకుపడుకో.
…రవి గాడి మొహం లో నెత్తురు చుక్క లేదు…
రవి: బావా… అరేయ్ బావా. ఇంతసేపు పక్కనే పడుకోని మాట్లాడావ్ కదా రా. దయ్యలా గురించి అడుగుతూ ఇలా భయపెడుతున్నావా!
అంటూ పక్కకి చూసాడు… వాడి చాప తప్ప ఇంకో చాప లేదు, నా దుప్పట్లు చాప అన్ని మడతపెట్టి అల్మారా లో పెట్టి ఉన్నాయ్.
శ్రీను: నువ్వేం చెప్పినా భయపడను రా నేను. పడుకున్నాకా నీ స్టొరీ వింటా, పిస్ కొట్టి వస్తా ఆగు.
శ్రీనుబాత్ రూం లోకి వెళ్లాడు …. పవర్ పోయింది…. ఈ లోపు మళ్ళీ డోర్ లాక్ ఓపెన్ చేస్తున్నారు ఎవరో… లోపలకి వచ్చాడు అతను… పవర్ వచ్చింది…బాత్రూం నుండి శ్రీను బయటకి వచ్చాడు… రవి పక్కన ఒకడు ముసుగుతన్ని పడుకోని… “బావా! దయ్యాలున్నాయా లేవా చెప్పవేంట్రా”… అని రవిని అడుగుతున్నాడు. ఈ లోపు రవి గాడి ఫోన్ రింగ్ అవుతుంది, శ్రీను కాలింగ్ అని వస్తుంది అందులో. అప్పటికే షాక్ లో ఉన్న రవి ఫోన్ ఎత్తాడు.
ఫోనులో: బావా! నేను ఆఫీసులో పడుకుంటున్నా, రేపోద్దునోస్తా. నువ్వు పడుకో. మర్చిపోయా మన కాలనీలో ఏవో వింతగా జరుగుతున్నయట తలుపులు తియ్యకు, జాగ్రత్తా అని చెప్తున్నాడు.
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .. . . . . . .
దయ్యాలున్నాయా, లేవా అనేది పక్కన పెడితే. రవి ప్లేస్ లో మీరుంటే ఏమి చేస్తారో కింద కామెంట్ చేయండి.

Comments
Post a Comment